- Advertisement -
హైదరాబాద్ లోని సరూర్‌నగర్‌లో రోడ్డు ప్రమాదం చోటుచేసకుంది. గురువారం ఉదయం అపార్ట్‌మెంట్ పక్కన పార్కింగ్ చేసిన రెండు కార్లను మరో కారు ఢీకొట్టింది. వెంటనే కారు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ప్రమాదంలో మూడు కార్లు దెబ్బతిన్నాయి. కారులో బీరు సీసాలు కనిపించడంతో మద్యం మత్తులోనే కారు నడిపినట్టు అనుమానాలు కలుగుతున్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్ కూడా గాయపడినట్టు సమాచారం. వీధిలో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పిందని పోలీసులు పేర్కొన్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -