Thursday, May 8, 2025

ఎంత పని చేసింది బైక్… ఆత్మహత్య చేసుకున్న కుమారుడు

- Advertisement -
- Advertisement -

అమరావతి: కుమారుడు బైక్ ప్రమాదంలో రెండు సార్లు గాయపడడంతో తనయుడికి తల్లి ద్విచక్రవాహనం ఇవ్వలేదు. ఈ క్రమంలో కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సత్యసాయి జిల్లా ధర్మవరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. తుంపర్తి గ్రామానికి చెందిన రవి (18) అనే యువకుడు భవన నిర్మాణ కార్మికుడు పని చేస్తూ తన తల్లిదండ్రితో కలిసి జీవిస్తున్నాడు. గత కొన్ని రోజుల నుంచి బైక్ కావాలని తల్లి రమణమ్మను కోరాడు. కుమారుడి కోరిక మేరకు అతడికి బైక్ కొనుగోలు చేసి తల్లి ఇచ్చింది. బైక్ పైనుంచి రెండు సార్లు పడిపోవడంతో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో తన కుమారుడిని బైక్‌కు దూరంగా ఉంచాలని నిర్ణయం తీసుకుంది. బైక్ ఇవ్వాలని కుమారుడు అడగడంతో ఇవ్వనని తెగేసి చెప్పింది.

ఇప్పటికి రెండు సార్లు ప్రమాదాలు జరిగాయని, ప్రమాదాల బారిన పడితే తమకు దక్కవని కుమారుడితో తల్లి వాపోయింది. ఆగ్రహంతో రగిలిపోయిన కుమారుడు తన సెల్‌ఫోన్‌ను పగులగొట్టాడు. తల్లితో గొడవ పడి ఇంట్లోని తన రూమ్‌లోకి వెళ్లిపోయాడు. తల్లి ఆరుబయట నిద్రిస్తుండగా కుమారుడు ఇంట్లోకి వెళ్లి ఉరేసుకున్నాడు. బుధవారం తెల్లవారుజామున ఇంట్లోకి వెళ్లి చూడగా కుమారుడు ఉరేసుకోవడంతో తల్లి కుప్పకూలిపోయింది. తన కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. కుమారుడికి ఏం కావొద్దని బైక్ ఇవ్వలేదని బోరున విలపిస్తూ చెప్పింది. ఒక్కగానొక కుమారుడు లేకపోవడంతో తల్లి, తండ్రి విషాదంలో మునిగిపోయారు. మాకు దిక్కెవరు అంటూ బోరున విలపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News