Saturday, July 26, 2025

సెమీస్‌లో సాత్విక్ జోడీ

- Advertisement -
- Advertisement -

ఇక్కడ జరుగుతున్న చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత్‌కు చెందిన సాత్విక్ సాయిరాజ్‌చిరాగ్ శెట్టి జోడీ పురుషుల డబుల్స్ విభాగంలో సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్ భారత సంచలనం ఉన్నతి హుడా పోరాటం క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. ఉన్నతి శుక్రవారం జరిగిన పోరులో జపాన్ షట్లర్ యమగూచి చేతిలో పరాజయం పాలైంది. యమగూచి 2116, 2112తో ఉన్నతిని ఓడించింది. ఇక సాత్విక్ జంట క్వార్టర్ ఫైనల్లో 2118, 2114తో అమెరికాకు చెందిన ఓంగ్‌టియో జోడీపై విజయం సాధించింది. చివరి వరకు నిలకడగా ఆడిన సాత్విక్ జోడీ వరుసగా రెండు సెట్లు గెలిచి సెమీస్‌కు చేరుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News