రెండవ ప్రపంచ యుద్ధం 1939 -45 మధ్య కాలంలో జరిగింది. పెట్టుబడిదారీ విధానం సామ్రాజ్యవాద రూపం తీసుకుని అనేక దేశాలను వలసలుగా మార్చారు. వలస దేశాల్లోని ప్రజల శ్రమశక్తిని, సంపదను పెట్టుబడిదారీ దేశాలు దోచుకున్నాయి. ఇంగ్లాండు, ఇటలీ, పోర్చుగీసు, జర్మనీ, అమెరికా దేశాల్లోని పెట్టుబడిదారీ వర్గం ప్రపంచ శ్రామిక సంపదను దోపిడీ చేయడంలో పోటీపడ్డాయి. ఇటలీ నియంత ముస్సోలిని, జర్మనీ నాజీ నియంత హిట్లర్ జాతీయోన్మాదాన్ని రెచ్చగొట్టి ఆయా దేశాల్లో అధికారాన్ని చలాయించారు. జాతీయోన్మాదం పేరుతో ఆయా దేశాల ప్రజల ఆమోదం పొందారు. నాజీ హిట్లర్ యూదులను వేటాడి చిత్రహింసలు పెట్టీ చంపిన చర్యలను పుస్తకాలలో చదివినప్పుడు యూదులపట్ల అయ్యో పాపం అనిపించేది. అభివృద్ధి కాముకులైన ప్రపంచం మొత్తం హిట్లర్ యూదులను హననం చేయటంపట్ల యావత్ ప్రపంచం వ్యతిరేకించింది. జాతి దురహంకారంతో హిట్లరు ప్రపంచాన్ని శాసించాలని మానవ హననానికి పాల్పడ్డాడు.
దాదాపు 85 మిలియన్ల (8.5 కోట్లు) మందికిపైగా ప్రజలు, సైనికులు రెండవ ప్రపంచ యుద్ధంలో చనిపోయారు. లక్షలాది మంది క్షత్రగాత్రులయ్యారు. అనేక కారణాల రీత్యా యూదులు ప్రపంచంలో అనేక దేశాలకు వలస వెళ్లారు. రెండవ ప్రపంచ యుద్ధానంతరం యూదులకు ఒక దేశం కావాలని వారి పూర్వపు భూభాగమైన పాలస్తీనాను విభజించటం వలన ఇజ్రాయెల్ దేశం ఆవిర్భవించింది. పాలస్తీనా భూభాగాన్ని యూదులకు ఇచ్చి ఇజ్రాయెల్ దేశం ఏర్పాటు చేయటాన్ని భారత జాతిపిత మహాత్మా గాంధీ ఆనాడే తీవ్రంగా వ్యతిరేకించారు. అమెరికాలో అత్యంత ధనవంతులు, అమెరికా సెనేట్లో యూదులు అత్యంత ప్రభావం కలిగినవారు. అమెరికా సామ్రాజ్యవాద పాలక వర్గంలో, ఆయుధ వ్యాపారంలో యూదులు ప్రభావశీలురు.
ఇప్పుడు అదే ఇజ్రాయెల్ అమెరికా అండదండలతో యూదులు పాలస్తీనా వారిపై చేస్తున్న దాడులు, హత్యలు చూస్తుంటే వారి పట్ల అసహ్యం వేస్తున్నది. మానవ హక్కులు అని గగ్గోలు పెట్టే అమెరికా తన ప్రయోజనాల కోసం పాలస్తీనాను ప్రపంచ పటం నుండి తుడిచి వేయటానికి ఇజ్రాయెల్‌ని పావుగా వాడుకుంటున్నది. నిన్న 22- -5 – 2025న అమెరికాలోని వాషింగ్టన్‌లో యూదుల మ్యూజియం వద్ద పాలస్తీనా ‘స్వేచ్ఛవాదులు’ ఇరువురు త్వరలో పెళ్లి చేసుకోబోతున్న యువ ప్రేమ జంటను కాల్చి చంపారు. వారి పేర్లు యారోన్లిస్కిన్సి, షారాణ లిన్ మిల్క్ గ్రిమ్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అనేక దేశాల దేశాధినేతలు ఈ ఘటనను ఖండించారు. హంతకులను అమెరికా పోలీసులు వెంటనే నిర్బంధించారు.
నిన్న పాలస్తీనా ఆరోగ్యశాఖ మంత్రి మాజెద్ అబు రమదాన్ మాట్లాడుతూ గాజాలో 29 మంది పసిపిల్లలు, పెద్దలు ఈ రెండు రోజుల్లో ఆహారం లేక చనిపోయారని విచారణ వ్యక్తం చేశారు. గాజా పట్టణం ఇజ్రాయెల్ దిగ్బంధంలో ఉన్నది. గత సంవత్సర కాలం పైగా పాలస్తీనా ప్రజలు, గాజా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఐక్యరాజ్యసమితి ఉన్నతాధికారి బిబిసితో మాట్లాడుతూ 14,000 మందికిపైగా పసిపిల్లలు ఇజ్రాయెల్ దాడిలో చనిపోయారని వాస్తవానికి ఈ లెక్క తక్కువేనని తెలియజేశారు. బయట ప్రాంతాలనుంచి ఆహారం, మందులు రాకుండా గాజాను దిగ్బంధించారు. గాజా పట్టణంలో సగానికి సగం ప్రజానీకం ఆకలితో అల్లాడుతున్నారు. గత మార్చి నుండి ఇజ్రాయెల్ గాజా పట్టణాన్ని పూర్తిగా దిగ్బంధించింది.
గాజా పట్టణంలో ఉన్నటువంటి 36 హాస్పిటల్స్‌లో కేవలం ఏడు లేక ఎనిమిది హాస్పిటల్స్ మాత్రమే పనిచేస్తున్నాయి. అందులో కూడా నామమాత్రపు మందులు కూడా లేవు. బయట నుండి ఈ మూడు నెలల్లో గాజా పట్టణానికి 90 నుంచి 100 ట్రక్కుల లోడ్ బేకరీలకు అవసరమైన పిండి మాత్రమే వచ్చింది. మందులు కూడా బయట ప్రాంతాల నుంచి రానివ్వడం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రపంచ జనాభాలో 300 కోట్లకు పైగా భారత్, చైనా, రష్యాల్లో ఉన్నారు. వామపక్ష భావజాలం కలిగిన దేశాలు, మూడో ప్రపంచ దేశాల్లోని ప్రజలు, శ్రామిక వర్గం పాలస్తీనా ప్రజలకు అండదండలు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాలస్తీనాను రక్షించాలి! అమెరికా సామ్రాజ్యవాదాన్ని, ఇజ్రాయెల్ దురాక్రమణను యావత్ ప్రపంచం వ్యతిరేకించాలి! మానవ హక్కులకై వెలుగెత్తి చాటాలి!
- కొల్లిపర వెంకటేశ్వరరావు, 93923 25652