Thursday, May 22, 2025

ఏ స్కామ్ లేకున్నా, ఏదో స్కామ్ ఉన్నట్టు చూపారు: జగన్

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఏ స్కామ్ లేకున్నా, ఏదో స్కామ్ ఉన్నట్టు చూపారని ఎపి వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజలతో కలిసి కలెక్టర్లకు వినతిపత్రాలు ఇస్తామని జగన్ అన్నారు. ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు హామీలపై నిరసన కార్యక్రమం చేపడతామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే నెల 4న వెన్నుపోటు దినం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొనాలని జగన్ కోరారు. కూటమి ప్రభుత్వం 2015- 19 మధ్య 5 కంపెనీలకు 69 శాతం ఆర్డర్లు ఇచ్చారని చెప్పారు. కొన్ని బ్రాండ్ లకు మాత్రమే డిమాండ్ సృష్టించారని, లాటరీ పేరుతో రిగ్గింగ్ చేసి మద్యం షాపులు దోచుకున్నారని మండిపడ్డారు. 11 మంది జర్నలిస్టులపై దాడులు చేసారని, 8 మందిని జైలుకు పంపారని విమర్శించారు. 2,466 మంది వైసిపి శ్రేణులపై అక్రమ కేసులు పెట్టారని, 766 మంది కార్యకర్తలపై దాడులు జరిగాయని అన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో 390 మంది హత్యకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News