Wednesday, August 13, 2025

నాగర్కర్నూల్లో ప్రమాదం: బైక్ను తప్పించబోయి.. స్కూల్ బస్సు బోల్తా

- Advertisement -
- Advertisement -

నాగర్ కర్నూల్ జిల్లా మండలంలో పెను ప్రమాదం తప్పింది. ఓ బైక్ ను తప్పించబోయి స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటన గన్యాగుల గ్రామ శివారులో చోటుచేసుకుంది. బుధవారం ఉదయం పెద్దకొత్తపల్లి ఆల్ సెంట్స్ మోడల్ స్కూల్ బస్సు విద్యార్థులను ఎక్కించుకుని తీసుకెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న బైక్ ను తప్పించే క్రమంలో బస్సు అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాద సమయంలో పొలంలో వారి నాట్లు వేస్తున్న కూలీలు వెంటనే స్పందించి.. బస్సులో చిక్కుకున్న విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలు కాగా.. మిగతా వారందరూ క్షేమంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 20 మంది విద్యార్థులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News