భారత్-పాకిస్తాన్ దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించడంతో ప్రస్తుతం పంజాబ్ సరిహద్దులో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న రాత్రి 9 గంటల నుంచి 12 గంటల వరకు బ్లాకౌట్ ఏర్పాటు చేసిన అనంతరం అమృత్‌సర్, హోషియార్‌పూర్, గురుదాస్‌పూర్‌లలో ఎత్తివేశారు. నిన్న రాత్రి జలంధర్‌లో పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లఘించి దాడులు జరిపిందని.. దీంతో డ్రోన్ కూల్చివేశారని వస్తున్న వార్తా కథనాలను భారత్ ఆర్మీ ధృవీకరించలేదు.
ఇక, ముందు జాగ్రత్త చర్యగా మే 13న అమృత్సర్‌లోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు మూసివేసినట్లు అధికారులు తెలిపారు. పఠాన్‌కోట్, అమృత్సర్‌లలో, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు మంగళవారం మూసివేసి ఉంటాయని.. అయితే, ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించవచ్చని అధికారులు తెలిపారు. మరోవైపు, గురుదాస్‌పూర్, సంగ్రూర్, బర్నాలా జిల్లాల్లో మంగళవారం పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి.
- Advertisement -