- Advertisement -
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచేందుకుగానూ జూన్ 6 నుంచి బడిబాట కార్యక్ర మం నిర్వహించనున్నారు. జూన్ 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం కానుండగా, బడిబాట కార్యక్రమంలో వచ్చే నెల 6 నుంచి ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. బ డిబాట కార్యక్రమంలో తల్లిదండ్రులు, స్వఛ్చంద సంస్థలను భాగస్వామ్యం చేసి పిల్లలను పాఠశాలల్లో చేర్పించనున్నారు. ఇందు లో భాగంగా శుక్రవారం(మే 9) గ్రామాలలో మెగా పేరెంట్ టీ చర్ మీటింగ్(పిటిఎం) నిర్వహించాలని ఆయా జిల్లాల డిఇఒలు ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత ప్ర తి శుక్రవారం పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించాలని తెలిపా రు. ప్రభుత్వ పాఠశాలల్లోనే అన్ని వసతులు కల్పించడంతో పా టు ఇంగ్లీష్ మీడియం బోధన అందిస్తుండడంతో ప్రవేశాలు పెం చేలా పాఠశాల విద్యాశాఖ కార్యక్రమాలు నిర్వహించనున్నది.
- Advertisement -