Tuesday, September 16, 2025

అదుపుతప్పిన స్కూటీ.. ఉపాధ్యాయుడి మృతి

- Advertisement -
- Advertisement -

నారాయణఖేడ్ మండల పరిధిలోని అబ్బెంద కిందితండాకు చెందిన ఖెడావత్ దూప్‌సింగ్ ఆదివారం ఖేడ్ రాజీవ్‌చౌరస్తా నుంచి మంగల్‌పేట్ వైపు వెళ్తున్న క్రమంలో స్కూటీ అదుపుతప్పి కింద పడడంతో తలకు బలమైన గాయమైంది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడని స్థానికులు తెలిపారు. స్థానికులు అంబులెన్ష్ కాల్ చేయడంతో ఖేడ్‌లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతిచెందిన దూప్‌సింగ్ కంగ్టి మండల పరిధిలోని దామర్‌గిద్దా యూపీఎస్‌లో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఖేడ్ ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News