Monday, July 21, 2025

నాలుగు సినిమాలతో అలరించనుంది

- Advertisement -
- Advertisement -

అందాల తార జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హిందీతో పాటు తెలుగులోనూ పలు సినిమాలు చేస్తోంది. అవన్నీ ఇప్పుడు వరుసగా విడుదల డేట్స్ ఫిక్స్ చేసుకుంటున్నాయి. నిజానికి ఈ నెలలోనే ఆమె నటించిన బాలీవుడ్ చిత్రం పరమ్ సుందరి విడుదల కావాలి. కానీ చివరి నిమిషంలో వాయిదా పడింది. వచ్చే నెల విడుదల అయ్యే అవకాశం ఉంది. అక్టోబర్‌లో మరో సినిమా రానుంది. కరణ్ జోహార్ నిర్మిస్తోన్న సన్నీ సంస్కారికీ తులసి కుమారి సినిమా దసరా కానుకగా అక్టోబర్ 2న విడుదల కానుంది. తాజాగా నిర్మాణ సంస్థ రిలీజ్ డేట్ ని ప్రకటించింది. డిసెంబర్ లో హోంబౌండ్ సినిమా విడుదల కానుంది. ఇది ఇప్పటికే కేన్స్ ఫిలిం ఫెస్టివల్ (Cannes Film Festival) లో ప్రదర్శితమై ఆకట్టుకుంది. ఆమె నటిస్తున్న బడా తెలుగు చిత్రం పెద్ది. రామ్ చరణ్‌తో ఆమె నటిస్తోన్న మొదటి మూవీ. షూటింగ్ జరుగుతోంది. మార్చి 27, 2026న విడుదల కానుంది పెద్ది. మొత్తంగా ఈ భామ నుంచి వరుసగా నాలుగు సినిమాలు విడుదల కానున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News