Sunday, July 13, 2025

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బోనాల పండుగ సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఉజ్జయిని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సిఎం రేవంత్‌కు మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, ఎంఎల్‌ఎలు దానం నాగేందర్, ఘన స్వాగతం పలికారు. సిఎంతో పాటు మంత్రులు, ఎంఎల్‌ఎలు ఉజ్జయిని అమ్మవారికి ప్రత్యేక పూజల చేశారు. భాగ్యనగరంలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తుల కోసం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆరు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. 2500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 200 సిసి కెమెరాలతో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి జాతరను పర్యవేక్షిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News