Saturday, May 10, 2025

మిస్ వరల్డ్ పోటీలకు భద్రత కట్టుదిట్టం

- Advertisement -
- Advertisement -

నేడు గచ్చిబౌలి స్టేడియంలో ఓపెనింగ్ సెర్మనీ

మన తెలంగాణ/హైదరాబాద్ : మిస్ వరల్డ్ పోటీల (Miss World pageant) ఈవెంట్‌ను ప్రభుత్వం ఎంతో ఛాలెంజింగ్‌తో నిర్వహిస్తోంది. ఒకవైపు ఇండియాపాకిస్తాన్ యుద్ధ వాతావరణంలో ఇప్పటికే ఐపిఎల్‌ను వారం పాటు బిసిసిఐ వాయిదా వేసింది. దేశ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో మిస్ వరల్డ్ -2025 (Miss World pageant) పోటీలను కట్టుదిట్టమైన భద్రతల నడుమ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగాతీసుకున్న మిస్ వరల్డ్ పోటీలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు మాదాపూర్ డిసిపి వినీత్ తెలిపారు.

శనివారం గచ్చిబౌలి స్టేడియంలో గ్రాండ్ ఓపెనింగ్ సెర్మనీ ఉన్నందున ఈ కార్యక్రమనికి టూరిజం శాఖ పాస్‌లు ఉన్న వారికే అనుమతి ఉంటుందని ఆయన చెప్పారు. ఈవెంట్ కు సంబంధించి ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. “స్టేడియంలో జరిగే ఈవెంట్‌కు 300 నుండి 350 మంది పోలీసులు బందోబస్త్‌లో ఉంటారు. ఇప్పటి వరకు 103 మంది కంటెస్టెంట్స్ వచ్చినట్లు సమాచారం ఉంది. దేశ సరిహద్దులో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని టైట్ సెక్యురిటి ఏర్పాటు చేశాము. గచ్చిబౌలి స్టేడియం, హెచ్‌ఐసిసి, కంటెస్టెంట్స్ బస చేసే హోటల్స్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశాము. భద్రతకు సంబంధించి డీజీపీ, సైబరాబాద్ సిపి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు” అని వెల్లడించారు.

ఈవెంట్ నిర్వహిస్తున్న ఏరియాలో భారీ బందోబస్తు ఉంటుందని చెప్పారు. మాదాపూర్ పరిధిలో మొత్తం 500 మంది బందోబస్తులో ఉంటారని అన్నారు. మాదాపూర్ జోన్ పరిధిలో కమ్యూనియల్ క్రిమినల్ హిస్టరీ ఉన్న వ్యక్తులపై నిఘా పెట్టినట్లు చెప్పారు. విదేశాల నుండి వచ్చిన కంటెస్టెంట్స్ ప్రయాణించే రూట్స్ మొత్తం ట్రాఫిక్, లా ఎండ్ ఆర్డర్ పోలీసులు కో ఆర్డినెట్ చేస్తున్నారని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రత పరంగా అన్ని చర్యలు తీసుకున్నామని ఈ సందర్భంగా చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News