Friday, May 2, 2025

ఆదివాసీలకు ఇబ్బంది కలిగించొద్దు : సీతక్క

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆదివాసీల విషయంలో కేంద్రం రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని మంత్రి సీతక్క తెలిపారు. కేంద్ర బలగాల ఆంక్షలతో ఆదివాసీల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీలు సీతక్కను కలవడంతో ఆమె మీడియాతో మాట్లాడారు. ఆదివాసీలు జీవనాధారం కోల్పోయేలా కేంద్ర బలగాలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని మండిపడ్డారు. కగార్ ఆపరేషన్‌ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మావోయిస్టులతో కేంద్రం శాంతిచర్చలు జరపాలని కోరారు. ఆదివాసీల జీవనానికి ఇబ్బంది లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

మధ్య భారతంలో ఆదివాసులకు ఎక్కువగా బతుకుతున్నారని వారిని ఇబ్బంది గురి చేయడం మోడీ ప్రభుత్వానికి మంచిది కాదని హితువు పలికారు. అడవితో ఆదివాసీలకు అనుబంధం ఉందని, వేసవి కాలం వచ్చిందంటే ఇప్ప పువ్వు వాళ్ల జీవనాధారంగా ఉందని, అడవిలో వెళ్లకుండా ఆదివాసీలను భద్రతా బలగాలు అడ్డుకుంటున్నాయని దుయ్యబట్టారు. తునికాకు, ఇప్ప పువ్వు సేకరణ అనేది ఆదివాసీలు జీవనం విధానం అని, ఇలాంటి వాటికి అడ్డంకులు సృష్టించవద్దని కేంద్రాన్ని మంత్రి సీతక్క కోరారు. ఆదివాసీల హక్కుల కోసం చాలా పోరాటాలు జరిగాయని గుర్తు చేశారు. మావోయిస్టులు మతోన్మాదులు కాదు అని వారితో చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీతక్క డిమాండ్ చేశారు. కేంద్రమే ఆదివాసీలకు రక్షణ కల్పించాలని మోడీ ప్రభుత్వాన్ని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News