Saturday, September 13, 2025

నాలుగు స్తంభాల ఆట అధికారం కోసమే: సీతక్క

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాళేశ్వరం విచారణ నిష్పక్షపాతంగా జరుగుతోందని మంత్రి సీతక్క తెలిపారు. నిజాయితీపరులు అయితే విచారణకు హాజరుకావాలని సవాల్ విసిరారు. మంగళవారం సీతక్క మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుల్లో దోచుకున్న డబ్బుతో విదేశాల్లో సంబరాలు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ అవతరణ దినోత్సవం అమెరికాలో జరుపుకోవడం ఏంటి అని ప్రశ్నించారు. బిఆర్ఎస్ లో నాలుగు స్తంభాల ఆట అధికారం కోసమే అని చురకలంటించారు. లిక్కర్ కేసును డైవర్ట్ చేసేందుకే బిఆర్ఎస్ డ్రామా ఆడుతోందని సీతక్క విరుచుకపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News