- Advertisement -
హీరో కార్తి తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్‌బస్టర్ హిట్ అయిన ‘సర్దార్’కి సీక్వెల్ ‘సర్దార్ 2’(Sardar 2) తో ప్రేక్షకులు ముందుకు రానున్నారు. ప్రీక్వెల్‌కి దర్శకత్వం వహించిన పిఎస్ మిత్రన్ సర్దార్2కి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ గ్రాండ్‌గా నిర్మిస్తోంది. తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా టీం అందరూ సెట్‌లో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలని మేకర్స్ (Photo Makers) షేర్ చేశారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో మాళవిక మోహన్, ఆషికా రంగనాథ్, రజిషా విజయన్ ఫిమేల్ లీడ్స్‌గా నటిస్తుండగా ఎస్‌జె సూర్య ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. సర్దార్2 చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.
- Advertisement -