Monday, August 18, 2025

భారీగా యాక్షన్ సీక్వెన్స్

- Advertisement -
- Advertisement -

‘ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, (Allu Arjun) స్టార్ డైరెక్టర్ అట్లీ’ సినిమా అప్‌డేట్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఇప్పుడు ఈ సినిమాపై ఓ అప్‌డేట్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ఎంట్రీ సీక్వెన్స్ కోసం భారీ సెట్స్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీక్వెన్స్‌లో అల్లు అర్జున్ గెటప్ చాలా కొత్తగా ఉండబోతుందట. బన్నీ ఫ్యాన్స్ కోసం స్పెషల్‌గా ఈ సీక్వెన్స్‌ను డిజైన్ చేశారని టాక్ నడుస్తోంది. అన్నట్టు ఈ సీక్వెన్స్‌లో అల్లు అర్జున్‌తో పాటు దాదాపు మూడు వందల మంది జూనియర్స్ కూడా స్క్రీన్‌లో కనిపిస్తారట.

బహుశా, ఇది యాక్షన్ సీక్వెన్స్ అయ్యి ఉండొచ్చు.  కాగా ఈ సినిమాలో దీపికా పడుకోణె హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక బన్నీ కోసం అట్లీ (Atlee for Bunny) ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ను పూర్తి చేశాడని తెలుస్తోంది. మాఫియా బ్యాక్ డ్రాప్‌లో ఓ డాన్ చుట్టూ ఈ కథా నేపథ్యం సాగుతుందట. సన్ పిక్చర్స్ వారు ఈ ప్రాజెక్టును భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాలో నటించనున్న మిగిలిన నటీనటుల గురించి కూడా అప్‌డేట్స్ ఇవ్వనున్నారు మేకర్స్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News