- Advertisement -
కోనసీమ: జిల్లాలోని ముమ్మిడివరం మండలం కనిమిలంక పంచాయతీ పరిధిలోని సలాదివారిపాలెంలో తీవ్ర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. శుభకార్యానికి వచ్చిన 11 మంది యువకులు చెరువులో స్నానం చేయడానికి వెళ్లిగా.. అందులో ఎనిమిది మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం పోలీస్, ఫైర్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాల ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టాయి. గల్లంతైన వారిలో ఏడు మృతదేహాలు(Seven Dead Bodies) లభ్యమయ్యాయి. రాజేశ్, మహేశ్, క్రాంతి, పాల్‌ల మృతదేహాలు చూసి కుటుంబసభ్యలు తీవ్రంగా రోధిస్తున్నారు. మిగితా వారి కోసం గాలింపు కొనసాగుతుంది. గల్లంతైన వారి వివరాలు.. కాకినాడ, రామచంద్రపురం, మండపేటకు చెందిన క్రాంతి, పాల్, సాయి, సతీష్, మహేశ్, రాజేశ్, రోహిత్, మహేశ్‌లుగా గుర్తించారు.
- Advertisement -