Sunday, July 6, 2025

బాధితులకు భరోసా నిందితులపై నిర్దయ

- Advertisement -
- Advertisement -

లైంగిక దాడుల నుంచి చిన్నారులు,
మహిళల రక్షణకు ఎందాకైనా వెళ్తాం
న్యాయమంటే శిక్షలు విధించడమే
కాదు.. బాధితులకు రక్షణ
కల్పించాలి సోషల్ మీడియా
విషయంలో జాగ్రత్తగా ఉండాలి
చైల్డ్‌ఫ్రెండ్లీ కోర్టులు స్థాపించిన తొలి
రాష్ట్రం తెలంగాణ ‘లైంగిక దాడుల
బాధిత చిన్నారుల రక్షణ, భద్రత’
సదస్సులో సిఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు
హాజరైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి,
హైకోర్టు జడ్జిలు, డిజిపి

మన తెలంగాణ/హైదరాబాద్ : చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడిన నిందితుల పట్ల తమ ప్ర భుత్వం ఎ లాంటి దయాదాక్షిణ్యాలు చూపబోదని అలాంటి వారిని క ఠినంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చే శారు. చిన్నారులపై లైంగిక హింసను అందరూ ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. న్యాయమంటే కేవలం శిక్ష లు వి ధించడం వరకే కాదని, బాధితుల జీవితానికి భ రో సా కల్పించాలని, వారికి అవసరమైన రక్షణ, స మాజంలో తగిన గౌరవం కల్పించేలా చర్యలు తీ సుకొని వారి బాల్యా న్ని తిరిగి పొందేలా ఈ చర్య లు ఉండాలని సిఎం అభిప్రాయపడ్డారు. శనివా రం నుంచి రెండు రోజుల పాటు హైదరాబాద్ లో ని డా.మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృ ద్ధి కేంద్రంలో ‘లైంగిక దాడులు బాధిత చిన్నారుల రక్షణ, భద్రత’ అనే అంశంపై తెలంగాణ భరోసా ఆధ్వర్యంలో ప్రారంభమైన సదస్సుకు సిఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథి గా హాజరయ్యారు. ఈ సదస్సులో సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సూర్యకాంత్, హైకోర్డు జడ్జిలు,రాష్ట్ర డిజిపి జితేందర్ రెడ్డి, పోలీసు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చిన్నారులు, మహిళల భద్రతకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆయన చెప్పారు. లైంగిక హింస నుంచి చిన్నారులు, మహిళలను రక్షించేందుకు ఎంత దూరమైనా వెళతామన్నారు. సామాజిక మాధ్యమాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, సోషల్ మీడియా అబ్యూజ్ ను కంట్రోల్ చేయాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు.

హైదరాబాద్ భరోసా సెంటర్ ఆధ్వర్యంలో చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు
‘వాయిస్ ఫర్ ది వాయిస్ లెస్’ అనే థీమ్‌తో తమ బాధను చెప్పుకోలేని వారికి రక్షణ కల్పించేందుకు ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం చాలా అవసరమని సిఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఎంతో కీలక మైన అంశంపై సదస్సు నిర్వహిస్తున్న తెలంగాణ పోలీసు, ఇతర నిర్వాహకులను ముఖ్యమంత్రి రేవంత్ అభినందించారు. ఇలాంటి నేరాలను నియంత్రించడమే కాకుండా బాల బాధితులకు చట్టపరమైన అన్ని రకాల రక్షణతో పాటు లైంగిక వేధింపుల నుంచి అన్ని రకాలుగా వారికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 29 భరోసా సెంటర్లు ఉన్నాయని, ఈ సెంటర్ల ద్వారా ఫ్రెండ్లీ వాతావరణంలో బాధితులకు పోలీస్, న్యాయ, వైద్య, కౌన్సిలింగ్ సహాయం అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. హైదరాబాద్ భరోసా సెంటర్ ఆధ్వర్యంలో చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టును ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టులను ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని సిఎం తెలిపారు. కేసులను వేగవంతంగా పరిష్కరించడమే కాకుండా పిల్లలకు సంపూర్ణ రక్షణ, వారిలో విశ్వాసం, అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవడం ఈ కేంద్రాల లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

చట్టాలు బాధితులకు హాని కలిగించకుండా ఉండాలి
ఫోక్సో చట్టం, జ్యువనైల్ చట్టాలు మన ప్రగతిశీల సాధనాలుగా పనిచేస్తున్నాయని సిఎం రేవంత్ తెలిపారు. అయితే ఆచరణలో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని, ఆ చట్టాలు బాధితులకు ఎలాంటి హాని కలిగించకుండా, వారి భవిష్యత్‌కు రక్షణగా సంపూర్ణ సహాయకారిగా ఉండాలని సిఎం రేవంత్ సూచించారు. సోషల్ మీడియా ద్వారా పిల్లలపై జరిగే దురాగతాలు, దుర్వినియోగం చేస్తున్న వారి పట్ల ఎలాంటి కరుణ చూపకుండా దోషుల విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. న్యాయం కేవలం కోర్టుల్లోనే కాకుండా ప్రతి దశలోనూ రక్షణ ఉండాలన్నారు. పోలీస్‌స్టేషన్, బాలల సంక్షేమ కేంద్రాలతో అన్ని ప్రక్రియల ద్వారా పిల్లలకు న్యాయం దక్కాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ విషయంలో న్యాయమూర్తులు, పోలీసు అధికారులు, బాలల సంక్షేమ కమిటీలు, ఇతర అభివృద్ధి భాగస్వామ్య సభ్యులందరూ తమవంతు సాయం అందించాలని ఆయన విజ్ఞప్తిచేశారు. ఇలాంటి విషయాల్లో అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.

అవగాహన కల్పించడం భేష్ : సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సూర్యకాంత్
అంతకు ముందు సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సూర్యకాంత్ తన కీలకోపన్యాసంలో చిన్నారులపై లైంగిక వేధింపులపై తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం, ఉమెన్ సెఫ్టీ విభాగం, రాష్ట్ర పోలీసు యంత్రాంగం, రాష్ట్ర లీగల్ సెల్ అథారిటీ సంయుక్తంగా ఏర్పాటుచేసిన ఈ సదస్సును అభినందించారు.
ఆందోళన కరంగా కేసులు : హైకోర్టు సిజె సుజయ్‌పాల్
రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ మాట్లాడుతూ పోక్స్ చట్టం కింద నమోదైన కేసులు గతకొన్ని సంవత్సరాల్లో రాష్ట్రంలో ఆందోళన కరంగా పెరిగిపోతున్నయన్నారు. ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న వారు 98 శాతం కుటుంబసభ్యులు, పొరుగువారు, సమీప బంధువులేనని ఆయన పేర్కొన్నారు. ఇది ఎంతో ఆందోళన కలిగించే అంశం అన్నారు. ఈ కేసులను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాల్సిందిగా సంబంధిత వర్గాలకు ఆయన సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News