- Advertisement -
హైదరాబాద్: ఎంఎంటిఎస్ రైలులో యువతిపై అత్యాచారం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. గత నెలలో ఎంఎంటిఎస్ రైలులో తనపై అత్యాచారయత్నం జరిగిందని.. దాని నుంచి తప్పించుకొనే క్రమంలో రైలు నుంచి దూకినట్లు యువతి వెల్లడించింది. అయితే యువతిపై అత్యాచారయత్నం అవాస్తవమని పోలీసులు తేల్చారు. రైల్వే పోలీసులను యువతి తప్పుదారి పట్టించిందని విచారణలో నిర్ధారణ జరిగింది. ఎంఎంటిఎస్‌లో రీల్స్ చేస్తూ.. యువతి జారిపడినట్లు తేలింది. వాస్తవాన్ని దాచి పెట్టి.. తనపై అత్యాచారయత్నం జరిగిందని యువతి నమ్మించింది. దర్యాప్తులో 300లకు పైగా సిసిటివి కెమెరాలను రైల్వే పోలీసులు పరిశీలించారు. దాదాపు 120 మంది అనుమానితులను ప్రశ్నించారు. అనంతరం యువతిపై అత్యాచారయత్నం జరగలేదని రైల్వే పోలీసులు తేల్చారు.
- Advertisement -