- Advertisement -
వైద్యురాలిని లైంగికంగా వేధించిన ఓ ప్రభుత్వ ఉద్యోగిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ వైద్యుడిగా పనిచేస్తున్న స్వామి తనతో పనిచేస్తున్న వైద్యురాలిపై గతకొంత కాలం నుంచి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. రోజు రోజుకు వేధింపులు ఎక్కువ కావడంతో బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -