Monday, August 25, 2025

సరికొత్త చరిత్ర సృష్టించిన షకీబ్ అల్ హసన్

- Advertisement -
- Advertisement -

బంగ్లాదేశ్ ఆటగాళ్లలో ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్‌కి (Shakib Al Hasan) మంచి ఫ్యాన్ బేస్ ఉంది. స్వదేశంలోనే కాదు ఇతర దేశాల్లోనూ అతన్ని ఇష్టపడతారు. అయితే తాజాగా షకీబ్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 2006 నుంచి టి-20 క్రికెట్ ఆడుతున్న షకీబ్.. ప్రస్తుతం జరుగుతున్న కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో అరుదైన ఘనత సాధించాడు. టి-20 ఫార్మాట్‌లో 7వేల+ పరుగులు, 500+ వికెట్లు తీసిన ఆటగాడిగా అతను రికార్డు సృష్టించాడు.

ఈ లీగ్‌లో అంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్ జట్టు తరఫున షకీబ్ (Shakib Al Hasan) ఆడుతున్నాడు. సర్ వివ్ రిచర్డ్స్ స్టేడియంలో సెయింట్ కిట్స్ అండ్ నెవీస్ పైరెట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన షకీబ్ తన జట్టుకు విజయాన్ని అందించాడు. బౌలింగ్‌లో 2 ఓవర్లలో కేవలం 11 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసి.. ప్రత్యర్థి జట్టును కోలుకోలేని దెబ్బ తీశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌లో 18 బంతులు ఎదురుకొని 25 పరుగులు చేశాడు. ఫలితంగా ఫాల్కన్స్ జట్టు 2 బంతులు మిగిలి ఉండగానే ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన షకీబ్‌కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఆవార్డు దక్కింది.

ఈ మ్యాచ్‌లో తీసిన మూడు వికెట్లతో టి20 క్రికెట్‌లో 500 వికెట్ల మైలురాయిని షకీబ్ చేరుకున్నాడు. రషీద్ ఖాన్, బ్రావో, నరైన్, ఇమ్రాన్ తాహిర్ తర్వాత ఈ రికార్డును చేరుకున్న ఐదో బౌలర్‌గా షకీబ్ నిలిచాడు. అంతేకాక.. పొట్టి ఫార్మాట్‌లో 500+ వికెట్లు, 7000+ పరుగులు తీసిన ఆటగాడిగా నిలిచాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News