Friday, May 9, 2025

సిగ్గు..సిగ్గు

- Advertisement -
- Advertisement -

బిజెపి ఎంపీ రమేశ్ బిధూరి అసభ్యంగా, దారుణంగా ప్రవర్తించడం సిగ్గుచేటు : కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : బిజెపి ఎంపీ రమేశ్ బిధూరి అసభ్యంగా, దారుణంగా ప్రవర్తించడం సిగ్గుచేటని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ట్విట్టర్ ద్వారా మండిపడ్డారు. మరింత దిగ్భ్రాంతికరమైన, అవమానకరమైన విషయం ఏమిటంటే స్పీకర్ లోక్‌సభలో ఈ అసంబద్ధతను అనుమతించడమేనని ఆయన ఎద్దేవా చేశారు. పార్లమెంటులో ఇదే జరిగితే, బిజెపి పాలిత రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే వణుకు పుడుతుందని మంత్రి కెటిఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.

బిజెపి ఎంపి రమేశ్ బిధూరి వ్యాఖ్యలపై టిఎంసి ఎంపి మహువా మొయిత్రా స్పందనకు సంబంధించిన ట్వీట్‌పై ఆయన పై విధంగా స్పందించారు. ‘ఈ వీడియోలో టిఎంసి ఎంపి మహువా మొయిత్రా స్పందిస్తూ బిజెపి ఎంపి రమేశ్ బిధూరి తోటి ఎంపి మీద అభ్యంతరకరమైన పదాలను ఉపయోగిస్తున్నారు. జాతి గౌరవాన్ని కాపాడే స్పీకర్ ఓం బిర్లా, విశ్వగురు నరేంద్ర మోడీ, బిజెపి అధ్యక్షుడు నడ్డా ఆయనపై చర్యలు తీసుకోండి’ అంటూ బిధూరి వ్యాఖ్యల వీడియోను షేర్ చేశారు. ‘ముస్లింలు, వెనుకబడిన వర్గాలను అవహేళన చేయడం బిజెపి సంస్కృతిలో భాగం. ఇందులో వారికి తప్పేమి కనిపించదు. నరేంద్ర మోడీ ఈ దేశంలో ముస్లింలను భయాందోళనలోకి నెట్టారు. కాబట్టే వారు మాట్లాడలేరు. చిరునవ్వుతో అన్నీ భరిస్తారు. కానీ, నాకు కాళికా మాత వెన్నముక ఇచ్చింది. కాబట్టి నేను ఇలాంటివి ఖండిస్తూనే ఉంటాన’ని రాశారు.

Ramesh Bidhuri

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News