Sunday, July 13, 2025

అనిల్ రావిపూడితో సినిమా ‘శివశంకర వరప్రసాద్’?

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహూ గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సుశ్మిత కొనిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని అర్చన సమర్పిస్తున్నారు. చిరంజీవికి జోడిగా నయనతార నటిస్తున్నారు. ఈ సినిమాకి ఇంకా పేరు నిర్ణయించలేదు. కానీ సంక్రాంతికి విడుదల చెయ్యాలనే లక్ష్యంతో షూటింగ్‌ని జరుపుతున్నారు. మరోవైపు వచ్చే నెల మెగాస్టార్ బర్త్ డే ఉంది. ఆగస్టు 22న మెగాభిమానులకు మంచి గిఫ్ట్ ఇవ్వాలంటే సినిమా టైటిల్ ప్రకటించాలి.

అందుకే అనిల్ రావిపూడి ఇప్పుడు ఆ పనిలో ఉన్నారు. ఆయన మూడు, నాలుగు టైటిల్స్ ని ఫిక్స్ చేశారు. అందులో ఏది ఫైనల్ చేస్తారనేది చూడాలి. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో శివశంకర వరప్రసాద్ అనే పాత్ర పోషిస్తున్నారు. ఈ పాత్ర పేరునే టైటిల్ గా పెట్టాలని అనిల్ రావిపూడి భావిస్తున్నట్లు సమాచారం. చిరంజీవి అసలు పేరు కూడా అదే. కొణిదెల శివశంకర వరప్రసాద్ అనే పేరుని (name Shiva Shankara Varaprasad) చిరంజీవి తల్లితండ్రులు పెట్టారు. అయితే సినిమాల్లో నటుడిగా మారాలనుకున్న తర్వాత ఆయన తన పేరుని చిరంజీవిగా మార్చుకున్నారు. ఇప్పుడు చిరంజీవి సొంత పేరు ఆయన కొత్త సినిమాకి టైటిల్ అయ్యేలా ఉంది. ఈ సినిమాలో వెంకటేష్ కి ఒక కీలక పాత్ర ఉంది. చిరంజీవితో ఉన్న స్నేహం, అనిల్ రావిపూడితో ఉన్న అనుబంధం కారణంగా వెంకటేష్ ఇందులో దర్శనమివ్వబోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News