న్యూయార్క్: ‘ఆపరేషన్ సిందూర్’పై కాంగ్రెస్ ఎంపి శశి థరూర్ ప్రశంసలు కురిపించారు. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ జరిపిన దాడులను ఆయన కొనియాడారు. ఉగ్రవాదులపై చాలా గట్టిగా, తెలివిగా భారత ఆర్మీ దాడి చేసిందని అన్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్.. ప్రపంచ ఉగ్రవాద వ్యతిరేక ప్రచారంలో భాగంగా ఐదు దేశాలకు అఖిలపక్ష బృందాన్నా కేంద్ర ప్రభుత్వం పంపించిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రతినిధిగా ఉన్న ఎంపి థరూర్.. న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్‌లో మాట్లాడుతూ.. “మీకు తెలిసినట్లుగా నేను ప్రభుత్వానికి పని చేయను. నేను ప్రతిపక్ష పార్టీకి పని చేస్తాను, కానీ నేను స్వయంగా ఇండియాలోని ప్రముఖ పత్రికలలో ఒకదానిలో రెండు రోజుల్లోనే భారత్.. గట్టిగా, తెలివిగా పాక్ ను దెబ్బకొట్టినట్లు రాశాను. భారత్ కూడా అదే చేసిందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను” అని తెలిపారు. తొమ్మిది నిర్దిష్ట ఉగ్రవాద స్థావరాలు, ప్రధాన కార్యాలయాలు, లాంచ్‌ప్యాడ్‌లపై భారత్ ఎలా ఖచ్చితమైన దాడులు చేసిందో ఆయన వివరించారు.
భారత్ చాలా తెలివిగా దాడి చేసింది..’ఆపరేషన్ సిందూర్’పై శశి థరూర్ ప్రశంసలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -