Thursday, May 29, 2025

కుటుంబ అంశాలు, అన్ని రకాల ఎమోషన్స్‌తో..

- Advertisement -
- Advertisement -

ప్రస్తుతం ఉన్న తరుణంలో ఓ ఫ్యామిలీ ఎమోషన్స్, కుటుంబ కథా చిత్రాలు, విలువలను చాటి చెప్పే కథల్ని నిర్మించడం అం టే మామూలు విషయం కాదు. అలాంటి ఓ సం దేశాత్మక చిత్రంగా ‘షష్టిపూర్తి’ (Shashtipurthi) సినిమాను రూపేశ్ నిర్మించారు. నిర్మాతగానే కాకుండా హీరోగానూ నటించారు. డా.రాజేంద్ర ప్రసాద్, అర్చ న, ఆకాంక్ష సింగ్ ప్రధాన పాత్రల్లో ఈ చిత్రాన్ని పవన్ ప్రభ తెరకెక్కించారు. మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం మే 30న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో హీరో, నిర్మా త రూపేశ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చెప్పిన విశేషాలు..ఎక్కువగా ఎంజాయ్ చేశా.. ‘షష్టిపూర్తి’ కథ నాకు చాలా నచ్చింది. ప్రస్తుతం ఇలాంటి కథలే రావడం లేదు. హింసతో కూడిన చిత్రాలే వస్తున్నాయి. ఇలాంటి విలువలతో స్క్రిప్ట్ నా వద్దకు రావడంతో ఎంతో ఆనందించాను. ఇందులో అన్ని రకాల అంశాలుంటాయి.

ఈ చి త్రాన్ని నిర్మించడం ఆనందంగానే ఉన్నా.. నటించడాన్ని ఎక్కువగా ఎంజాయ్ చేశాను. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. అన్ని రకాల ఎమోషన్స్‌తో.. ’షష్టిపూర్తి’ పూర్తిగా కల్పిత చిత్రమే. కానీ ఇందులోని పాత్రల్ని చూస్తే ఆడియెన్స్ మాత్రం తమని తాము చూసుకున్నట్టుగా కనెక్ట్ అవుతారు. ప్రస్తుతం అసలు స్వచ్చమైన ప్రేమను కూడా చూ పించడం లేదు. ఇందులో కుటుంబ అంశాలతో పాటుగా అన్ని రకాల ఎమోషన్స్‌ను చూపించాం.అలా ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చా.. ఈ కథను రాజేంద్ర ప్రసాద్ కోసమే పవన్ ప్రభ రాసుకున్నారు.

ఆయన కొడుకుగా నటించే వారి ది కొత్త మొహం అయితే ఎలాంటి అంచనాలు లేకుండా సినిమాను చూస్తారు. అందుకే కొత్త ఫేస్ కోసం దర్శకుడు చూశారు. చివరకు నేను ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చాను. పాటలు, ఆర్‌ఆర్ కదిలిస్తాయి.. ఇళయరాజా మ్యూజిక్‌తో సినిమా స్థాయి పెరిగింది. ప్రతీ పాటకు ఎన్నో ఆప్షన్స్ ఇచ్చారు. కీరవాణి అడిగిన వెంటనే పాటను రాసి ఇచ్చారు. చైతన్య ప్రసాద్ వల్లే ఇదంతా సాధ్యమైంది. ఇందులోని పాటలు, ఆర్‌ఆర్ ఆడియెన్స్‌ను కదిలిస్తా యి. అందమైన ప్రేమ కథ..
‘షష్టిపూర్తి’ చిత్రంలో అందమైన ప్రేమ కథ కూడా ఉంటుంది. ఆకాంక్ష చక్కగా నటించారు. కమర్షియల్ కోసం ఎలాంటి అనవసరపు అంశాల్ని జోడించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News