Friday, September 12, 2025

‘షష్టిపూర్తి’ టీమ్‌కు ఇళయరాజా అభినందనలు

- Advertisement -
- Advertisement -

‘మా ‘షష్టిపూర్తి’ చిత్రానికి ఇంత క్రేజు, గుర్తింపు లభించడానికి ప్రధాన కారణం ఇళయరాజా. ఆయన ప్రోత్సాహాన్ని జీ వితాంతం గుర్తు పెట్టుకుంటాను. ఇదే ఊపుతో మా ఆయి క్రియేషన్స్ బ్యానర్‌లో మరిన్ని మంచి సినిమాలు తీస్తాను. హీరోగా, నిర్మాతగా చాలా వృద్ధిలోకి వస్తావని ఆయన నన్ను మనస్పూర్తిగా ఆశీర్వదించారు. ఇంతకన్నా నాకేం కావాలి” అ ని సంబరపడిపోయారు రూపేష్. నటకిరీటి డా.రాజేంద్ర ప్రసాద్, అర్చన, రూపేశ్, ఆకాంక్ష ప్రధాన పాత్రల్లో మా ఆయి క్రియేషన్స్ బ్యానర్ పై రూపేశ్ నిర్మించిన చిత్రం ‘షష్టిపూర్తి’.

పవన్ ప్రభ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 30న విడుదలై, ప్రజాదరణ పొందుతోంది. ఇళయరాజా పుట్టిన రోజు సందర్భంగా మంగళవా రం ఉదయం చెన్నై వెళ్లి మరీ ఇళయరాజాకు జ న్మదిన శుభాకాంక్షలు తెలియచేసింది ‘షష్టిపూర్తి’ బృందం. డా.రాజేంద్ర ప్రసాద్, ఇళయరాజాకు పుష్పాభిషేకం చేశారు. ఈ సందర్భంలో డా. రాజేంద్రప్రసాద్ ఏప్రిల్1 విడుదల, ప్రేమించు పెళ్ళాడు చిత్రాల్లోని పాటల్ని పాడితే, ‘బాగా పాడుతున్నావ్ ప్రసాద్’ అని మెచ్చుకున్నారు. ఇళయరాజా గంటసేపు రాజేంద్ర ప్రసాద్, రూ పేష్, పవన్ ప్రభ, చైతన్య ప్రసాద్, రామ్‌తో ముచ్చటించి, ‘షష్టిపూర్తి’ లాంటి మంచి ప్రయ త్నం చేసినందుకు అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News