Thursday, July 3, 2025

షేక్ హసీనాకు 6 నెలల జైలుశిక్ష

- Advertisement -
- Advertisement -

పదవీచ్యుతురాలైన ప్రధాని షేక్ హసీనాకు కోర్టు ధిక్కారణ కేసులో బంగ్లాదేశ్ కోర్టు ఆరునెలల జైలు శిక్ష విధించింది. అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ఐసిటి) ఈ తీర్పును ప్రకటించింది.హసీనాకు విధించిన శిక్షను అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్-1 చైర్మన్ జస్టిస్ గోలం ముర్తుజా మొజుందార్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం నిర్ణయించింది. హసీనా అరెస్ట్ అయినా, లేదా లొంగిపోయిన రోజు నుంచి ఆమెకు విధించిన శిక్ష అమలులోకి వస్తుందని ఢాకా ట్రిబ్యునల్ పత్రిక తెలిపింది. 11 నెలలుగా భారతదేశంలో ప్రవాసంలో ఉన్న షేక్ హసీనాకు కోర్టు శిక్ష విధించడం అదే మొదటి సారి.
హసీనాతో పాటు, గోవింద్ గంజ్ కు చెందిన షకీల్ అకాండ్ బుల్బుల్ కు కూడా ట్రిబ్యునల్ ఇదే కోర్టు ధిక్కారణ నేరానికి గానూ రెండు నెలల జైలు శిక్ష విధించింది. బుల్బుల్ అవామీ లీగ్ విద్యార్థి విభాగమైన బంగ్లాదేశ్ ఛత్ర
లీగ్ (బిసిఎల్ ) కు చెందిన వ్యక్తి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News