Tuesday, May 20, 2025

నటి శిల్పా శిరోద్కర్‌కు కొవిడ్ పాజిటివ్

- Advertisement -
- Advertisement -

ప్రముఖ నటి శిల్పా శిరోద్కర్ కొవిడ్ బారిన పడ్డారు. పరీక్షల అనంతరం తనకు కొవిడ్ పాజిటివ్ తేలినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. తన అభిమానులకు జాగ్రత్తగా ఉండాలని, మాస్కులు ధరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా శిల్ప త్వరగా కోలుకోవాలని పలువురు అభిమానులు, నెటిజన్లు కామెంట్లు పెట్టారు. సింగపూర్, హాంకాంగ్, థాయ్‌లాండ్ తదితర దేశాల్లో ఇటీవల కొవిడ్ కొత్త కేసులు అధికంగా నమోదవుతున్నాయి. తెలుగు సినీ స్టార్ మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ స్వయాన శిల్పా శిరోద్కర్ సోదరి.

కొవిడ్ 19 పరిస్థితి అదుపులోనే ఉంది: ఆరోగ్య అధికారులు
సింగపూర్, హాంకాంగ్‌లలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయని వస్తున్న నివేదికలపై దృష్టిపెట్టామని, అది దేశంలో అదుపులోనే ఉందని అధికార వర్గాలు సోమవారం వెల్లడించాయి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అధ్యక్షతన సోమవారం నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ డివిజన్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల నిపుణుల సమీక్షా సమావేశం జరిగింది.

ప్రస్తుత కొవిడ్19 కేసులు ఇండియాలో అదుపులోనే ఉన్నాయని సమావేశం తుది నిర్ణయానికి వచ్చింది. భారత్‌లో 2025 మే 19 నాటికి కొవిడ్ 19 కేసులు 257నని, ఇది దేశ జనాభా పరంగా చాలా తక్కువ అని పేర్కొంది. పైగా ఇప్పుడున్న వ్యాధులు చాలా మైల్డ్ అని, హాస్పిటల్‌లో చేరి చికిత్స చేయించుకునేంత తీవ్రమైనవి కావని పేర్కొంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా ఎంతో జాగురుకతతో పరిస్థితిని పర్యవేక్షిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News