Thursday, May 1, 2025

డ్రగ్స్‌ రైడ్‌.. విచారణకు హాజరైన ‘దసరా’ విలన్

- Advertisement -
- Advertisement -

ఓ హోటల్ లో డ్రగ్స్‌ రైడ్‌ వ్యవహారం తర్వాత మలయాళ నటుడు షైన్‌ టామ్‌ చాకో తాజాగా పోలీసు విచారణకు హాజరైనట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం 10 గంటలకు ఆయన ఎర్నాకుళం పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. ఇటీవల కొచ్చిలోని ఓ హోటల్‌పై నార్కోటిక్ పోలీసులు డ్రగ్స్‌ రైడ్‌ చేయగా.. షైన్‌ టామ్‌ చాకో అక్కడి నుంచి పరారీ అయినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. గతంలో ఓ మూవీ షూటింగ్ సమయంలో షైన్ డ్రగ్స్ తీసుకుని తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ మలయాళ నటి విన్సీ సోనీ అలోషియస్ ఫిర్యాదు చేసింది.

ఈ క్రమంలోనే డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న సమాచారంతో ఓ హోటల్‌పై పోలీసులు రైడ్స్ చేశారు. అయితే, విషయం తెలసుకున్న షైన్.. పోలీసులు హోటల్‌కు రావడానికి కొద్దిసేపటి ముందే, మూడో అంతస్తులో ఉన్న రూం కిటికీ నుండి రెండో అంతస్తులోకి దూకి, అక్కడి నుంచి మెట్ల ద్వారా పారిపోయినట్లు కథనాలు వెలువడ్డాయి. కాగా, షైన్ దసరా మూవీలో విలన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత దేవర మూవీతోపాటు పలు తెలుగు, తమిళ సినిమాలల్లో నటిస్తూ బిజీ అయ్యాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News