హైదరాబాద్: పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ చిత్రం ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). అయితే ఈ సినిమా విడుదకు ముందు ఊహించని షాక్ తగిలింది. ఈ సినిమా ఎ ఎం రత్నంకు డిస్ట్రిబ్యూషన్ సంస్థలు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ‘టిఎష్‌సిసి)లో రెండు వేర్వేరు ఫిర్యాదులు చేశాయి. పైజాం డిస్ట్రిబ్యూషన్‌కు సంబంధించి రెండు సినిమాలకు ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సి డబ్బును ఇవ్వలేదన ని ఆపించాయి.
రత్నం నిర్మించిన ‘ఆక్సిజన్’ సినిమాకి సంబంధించి దాదాపు రూ.రెండున్నర కోట్లు రికవరీపై ఏషియన్ ఎంటర్‌ప్రైజెస్, ‘ముద్దుల కొడుకు’ , ‘బంగారం’ చిత్రాలకు సంబంధిచిన రూ.90వేల రికవరీపై మహాలక్ష్మీ ఫిలిమ్స్ సంస్థలు ఫిర్యాదు చేశాయి. ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) విడుదలకు ముందే తమ బాకీలు వసూలు చేయడంలో సహాయం చేయాలని అభ్యర్థించాయి. ఇతర డిస్ట్రిబ్యూటర్లు కూడా తమకు సహాయం చేయాలని కోరాయి.
ఇక సినిమా విషయానికొస్తే.. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్ కీలక పాత్ర పోషించారు. కీరవాణీ సంగీతం అందించిన ఈ సినిమాను కొంత భాగం క్రిష్, మిగితా భాగం ఎఎం జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. జూలై 24వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.