- Advertisement -
న్యూయార్క్: ఓ వ్యక్తి సోమవారం మన్‌హట్టన్ కార్యాలయ టవర్‌లోకి దూసుకెళ్లి తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో డ్యూటీలో లేని ఓ న్యూయా ర్క్ నగర పోలీసు అధికారి సహా ఐదుగురు మృతి చెందారని అధికారులు తెలిపారు. కాగా నిందితుడు నెవడాకు చెందిన షేన్ తమురాగా గుర్తించారు. అత డు చివరికి తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం. ప్రపంచంలోని అతిపెద్ద పెట్టబడి సంస్థలలో ఒకటైన ఎన్‌ఎఫ్‌ఎల్, బ్లాక్‌స్టోన్ ప్రధా న కార్యాలయాలు, ఇతర అద్దెదారులు ఈ ఆకాశహర్మంలో ఉన్నారు. ఇక్కడే కాల్పులు జరిగాయి. నిందితుడు ఈ ప్రదేశాన్నే ఎందుకు లక్షంగా చేసుకున్నాడన్న దానిపై మేము దర్యాప్తు చేస్తున్నాము’ అని పోలీస్ కమిషనర్ జెస్సికా టిష్ తెలిపారు.
- Advertisement -