Thursday, September 18, 2025

అమెరికాలో కాల్పులు: ముగ్గురు పోలీసులు మృతి

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: అమెరికా రాష్ట్రం పెన్సిల్వేనియాలో కాల్పులు కలకలం సృష్టించాయి. నార్త్ కొడరస్ టౌన్‌షిప్‌లో ఓ దుండుగుడు కాల్పులు జరపడంతో ముగ్గురు పోలీస్ అధికారులు మృతి చెందారు. పోలీసుల కాల్పుల్లో దుండగుడు హతమయ్యాడు. మరో ఇద్దరు గాయపడడంతో యార్క్ ఆస్పత్రికి తరలించారు. నార్త్ కొడరస్ టౌనిషిప్ లో 2500 మంది ప్రజలు ఉంటారని, స్కూల్ సమీపంలో కాల్పులు జరిగాయని పోలీసులు వెల్లడించారు. పిలిదెల్ఫియా నుంచి 160 కిలో మీటర్ల దూరంలో యార్క్ కౌంటీలో ఈ ఘటన  జరిగింది.  ముగ్గురు పోలీసులు మృతి చెందడం పట్ల గవర్నర్ జోష్ షాపిరో దిగ్భంత్రా వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలపడంతో వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ఇలాంటి హింస సరి కాదు, మన సమాజంగా మరింత మెరుగ్గా చేయాలని పిలుపునిచ్చారు. షాపిరో రాష్ట్రంలోని జాతీయ జెండాలను సగానికి దించి అమరులను స్మరించుకోవాలన్నారు.

Also Read: రేవంత్ ఓ నియంత: కెటిఆర్

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News