- Advertisement -
ఎపి డిప్యూడి సిఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన కామెంట్స్ చేశారు. పవన్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన వీడియో సందేశంలో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ పాటించే సనాతన ధర్మం క్రూరమైనదని.. అరాచకమైనదని తీవ్ర విమర్శలు చేశారు. “సనాతన ధర్మాన్ని సమర్దించే పవన్ కళ్యాణ్‌ను అరెస్ట్ చేయాలి. దాన్ని సమర్ధించిన వాళ్ళను అరెస్ట్ చేయాలి. సనాతన ధర్మంలో విడాకులే లేనప్పుడు.. పవన్ కళ్యాణ్ ఎలా విడాకులు తీసుకున్నాడు. సనాతన ధర్మాన్ని విమర్శించే వారిపై పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలంటున్నారు.. కానీ ఆ ధర్మాన్ని సమర్థించే వారిని శిక్షించాలి” అని సిపిఐ నారాయణ అన్నారు.
- Advertisement -