- Advertisement -
మన తెలంగాణ/ రంగారెడ్డి: మపంచాయతీ నిధుల దుర్వినియోగం పాల్పడ్డారనే ఆరోపణలతో ఓ పంచాయతీ కార్యదర్శికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి సురేశ్ మోహన్ తెలిపారు. ఈమేరకు రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్‌కు మంగళవారం షోకాజ్ నోటీసులు జారీచేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ పన్ను వసూళ్లలో అక్రమాలకు పాల్పడుతున్నట్లు సదరు పంచాయతీ కార్యదర్శిపై ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో డిపిఓ షోకాజ్ నోటీసులు జారీచేయడం గమనార్హం.
- Advertisement -