ఆస్ట్రేలియాఎతో జరిగే రెండు మ్యాచ్‌ల అనధికార టెస్టు సిరీస్ కోసం ఇండియా ఎ జట్టును ఎంపిక చేశారు. శ్రేయస్ అయ్యర్ భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. భారత్‌లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియాఎ టీమ్ రెండు టెస్టు మ్యాచ్‌లు, మరో మూడు వన్డేలు ఆడనుంది. సెప్టెంబర్ 16 నుంచి లక్నో వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరుగనుంది. రెండో టెస్టు సెప్టెంబర్ 23 నుంచి జరుగుతుంది. ఈ సిరీస్ కోసం 15 మందితో కూడిన జట్టును సెలెక్టర్లు ఎంపిక చేశారు. సీనియర్ క్రికెటర్లు మహ్మద్ సిరాజ్, కెఎల్ రాహుల్‌లు రెండో టెస్టు మ్యాచ్‌లో ఆడనున్నారు.
జట్టు వివరాలు:
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, ఎన్.జగదీశన్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడికల్, హర్ష్ దూబే, ఆయుష్ బదోని, నితీశ్ కుమార్ రెడ్డి, తనుష్ కోటియాన్, ప్రసిద్ధ్ కృష్ణ, గర్నూర్ బ్రార్, ఖలీల్ అహ్మద్, యశ్ ఠాకూర్, మానవ్ సుతార్, సిరాజ్, రాహుల్.
ఇండియా ఎ కెప్టెన్‌గా శ్రేయస్
- Advertisement -
- Advertisement -
- Advertisement -