సూపర్ హీరో తేజ సజ్జా పాన్- ఇండియా విజువల్ వండర్ ’మిరాయ్’లో సూపర్ యోధ పాత్రలో అలరించబోతున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రంలో శ్రియ శరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మేకర్స్ తాజాగా శ్రియను అంబికగా పరిచయం చేస్తూ ఒక ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేశారు. శ్రియ శరణ్ పవర్‌ఫుల్ మదర్ క్యారెక్టర్‌లో నటిస్తున్నారు. ఈ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్‌లో ఆమె పాత్ర చాలా బలమైన భావోద్వేగంతో ఉండబోతుంది. ఈ పోస్టర్ సూపర్ హీరో ప్రయాణం వెనుక ఉన్న ఎమోషన్‌ని హైలైట్ చేస్తుంది. ఈ చిత్రంలో తేజ సజ్జ సరసన రితికా నాయక్ కథానాయికగా నటిస్తుండగా, జయరామ్, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మిరాయ్ సినిమా సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
‘మిరాయ్’లో అంబికగా శ్రియ శరణ్
- Advertisement -
- Advertisement -
- Advertisement -