- Advertisement -
లక్నో: అంతర్జాతీయ రోదసి కేంద్రానికి వెళ్లి తిరిగొచ్చిన భారతీయ వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాకు తన హోంటౌన్ లక్నోలో సోమవారం ఘనస్వాగతం లభించింది. ఆయన ఆగస్టు 17ననే అమెరికా నుంచి ఇండియా తిరిగొచ్చారు. ఆయన ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకోవడమే కాక అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సిటీ మాంటెస్సోరి స్కూల్(సిఎంఎస్) విద్యార్థులు ఆయనకు స్వాగతం పలికారు. కొంత మేరకు వాన చినుకులు పడినా చిన్నారి విద్యార్థులు బారులు తీరి ఆయనకు స్వాగతం పలికారు. శుక్లా గాలిలో చేతులు ఊపుతూ అందరినీ ఉత్తేజపరిచారు. ఉపముఖ్యమంత్రి బ్రజేశ్ పాథక్ కూడా ఈ స్వాగత వేడుకలలో పాల్గొన్నారు.
- Advertisement -