యాక్సియం-4 మిషన్‌లో భాగంగా అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఐఎస్ఎస్)కి వెళ్లిన భారత వ్యోవగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) తిరిగి భూమిపైకి చేరుకున్నారు. అంతరిక్షంలో ఆయన 18 రోజులు గడిపారు. మానవాళికి ఉపయోగపడే ప్రయోగాలు చేశారు. అనంతరం డ్రాగన్ క్యాప్స్‌లో కాలిఫోర్నియా సమీపంలోని సముద్ర జలాలలో మంగళవారం మధ్యాహ్నం 3.01 గంటలకు ల్యాండ్ అయ్యారు. భూమికి తిరిగి రావడం సంతోషంగా ఉందని యాక్సియం-4 కమాండర్ పెగ్గీ విట్సన్ తెలిపారు.
అంతరిక్ష పరిశోధన కేంద్రంలో అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) రికార్డు సృష్టించారు. కాగా, భూమిపైకి చేరుకున్న ఈ వ్యోమగాయుల బృందాన్ని ఏడు రోజుల పాటు క్వారెంటైన్‌లో ఉంచనున్నట్లు స్పేస్ ఎక్స్ అధికారులు తెలిపారు. శుభాంశు శుక్లా తిరిగి భూమికి చేరుకోవడంపై సర్వత్ర హర్షం వ్యక్తం అవుతోంది. ఆయన తిరిగి భూమికి వచ్చిన సందర్భంగా స్వస్థలం లక్నోలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఆయన తల్లిదండ్రులు భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.
శుభాంశు శుక్లా పునరాగమనంపై ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేశారు. శుభాంశు పట్టుదల, అంకితభావం, సాహస చర్యల ద్వారా కోట్లాది మందికి స్పూర్తిగా నిలిచారని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఇది మన సొంత మానవ సహిత అంతరిక్ష ప్రయోగం గగన్‌యాన్‌కు దిక్సూచిగా నిలుస్తుందని అన్నారు.