Thursday, August 21, 2025

గిల్ అగ్రస్థానం పదిలం

- Advertisement -
- Advertisement -

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం ప్రకటించిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ ఆటగాడు శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. అయితే భారత సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు టాప్10 ర్యాంకింగ్స్ నుంచి వైదొలిగారు. కిందటి వారంలో ప్రకటించిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ రెండో, విరాట్ కోహ్లి నాలుగో ర్యాంక్‌లో ఉన్న సంగతి తెలిసిందే. కానీ తాజా ర్యాంకింగ్స్‌లో వీరిద్దరూ టాప్10 వైదొలగడం విశేషం. తాజా ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ 784 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. కిందటి సారి కూ డా గిల్ 784 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి న సంగతి తెలిసిందే.

అయితే అప్పట్లో రెండో ర్యాంక్‌లో నిలిచిన టీమిండియా వన్డే కెప్టెన్ తన ర్యాంక్‌ను కోల్పోయాడు. పాకిస్థాన్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజమ్ 739 పాయింట్లతో రెండో స్థానానికి (second place) చేరుకున్నాడు. న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిఛెల్ తాజా ర్యాంకింగ్స్‌లో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు.మిఛెల్ 720 పా యింట్లతో టాప్3లో చోటు సంపాదించాడు. ఇక ఇప్పటి వరకు నాలుగో ర్యాంక్‌లో కొనసాగిన టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లిత న ర్యాంక్‌ను కోల్పోయాడు. అతని స్థానంలో శ్రీలంక ఆటగాడు చరిత్ అసలంక నాలుగో ర్యాం క్‌ను కైవసం చేసుకున్నాడు. ఐర్లాండ్ ఆటగాడు హ్యారీ టెక్టర్ ఐదో, భారత స్టార్ ఆటగాడు శ్రేయ స్ అయ్యర్ ఆరో ర్యాంక్‌ను దక్కించుకున్నారు.

వెస్టిండీస్ స్టార్ షాయ్ హోప్ ఏడో, ఇబ్రహీం జ ద్రాన్ (అఫ్గాన్) 8వ ర్యాంక్‌లో నిలిచారు. కుశాల్ మెండిస్ (శ్రీలంక), ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా)లు తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. బౌలింగ్ విభాగాల్లో కేశవ్ మహారాజ్ (సౌతాఫ్రికా) టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో ఐదు వికెట్ల తో రాణించిన మహారాజ్ తాజా ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు మెరుగుపరుచుకుని అగ్రస్థానా న్ని దక్కించుకున్నాడు. మహీశ్ తీక్షణ (శ్రీలంక) రెండో, కుల్దీప్ యాదవ్ (భారత్) మూడో ర్యాం క్లో నిలిచారు. భారత బౌలర్ రవీంద్ర జడేజా తొమ్మిదో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News