బర్మింగ్‌హామ్: ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత సారథి శుభ్‌మాన్ గిల్ (Shubman Gill) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ (269) సాధించిన గిల్.. రెండో ఇన్నింగ్స్‌లో అదరగొడుతున్నాడు. 129 బంతుల్లో 9 ఫోర్లు 3 సిక్సులతో సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో పలు రికార్డులను అతను బద్దలు కొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ చేసి.. రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన ఆటగాళ్ల జాబితాలో గిల్ తొమ్మిదో స్థానంలో నిలిచాడు. భారత్ తరఫున 1971లో సునీల్ గవాస్కర్ తర్వాత ఈ ఫీట్ సాధించిన బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. కెప్టెన్‌గా రెండు ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ చేసిన మూడో భారత ఆటగాడిగా గిల్ నిలిచాడు. గతంలో సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లీ ఈ ఫీట్ సాధించారు.
అంతేకాక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి సిరీస్‌లోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా శుభ్‌మాన్ (Shubman Gill) నిలిచాడు. గతంలో ఈ రికార్డు కింగ్ కోహ్లీ పేరిట ఉండేది. కోహ్లీ కెప్టెన్‌గా తొలి సిరీస్‌లో 4 ఇన్నింగ్స్‌లో 449 పరుగులు చేయగా.. శుభ్‌మాన్ ఈ మ్యాచ్‌తో ఆ రికార్డును అధిగమించాడు.
అంతేకాక.. ఒకే టెస్ట్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా కూడా శుభ్‌మాన్ నిలిచాడు. గతంలో టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 344 పరుగులు చేశారు. ఈ టెస్ట్ మ్యాచ్‌తో గిల్ ఆ రికార్డును కూడా దాటేశాడు. ప్రస్తుతం 67 ఓవర్లు ముగిసేసరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసి 484 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజ్‌లో శుభ్‌మాన్ గిల్ (100), రవీంద్ర జడేజా (25) ఉన్నారు.