లండన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భారత కెప్టెన్‌గా తొలిసారి బాధ్యతలు తీసుకున్న శుభ్‌మాన్ గిల్ (Shubman Gill) అదిరిపోయే ఫామ్‌ని కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే ఈ సిరీస్‌లో నాలుగు శతకాలు.. ఓ డబుల్ సెంచరీ సాధించి.. తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. తాజాగా కెన్నింగ్టన్ ఓవెల్‌లో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్‌లో 47 ఏళ్ల రికార్డును గిల్ బ్రేక్ చేశాడు.
ఒక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా గిల్ (Shubman Gill) నిలిచాడు. ఈ క్రమంలో టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్‌ని దాటేశాడు. 1978/79లో జరిగిన వెస్టిండీస్ సిరీస్‌లో గవాస్కర్ 732 పరుగులు చేశారు. ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్‌లో గిల్ 737 పరుగులతో ఇంకా బ్యాటింగ్ చేస్తున్నాడు. గవాస్కర్ తర్వాత మూడు స్థానాన్ని విరాట్ కోహ్లీనే ఉన్నాడు. 2016/17లో ఇంగ్లండ్‌పై 655, 2017/18లో శ్రీలంకపై 610 పరుగులు, 2018లో ఇంగ్లండ్‌పై 593 పరుగులు చేశాడు కోహ్లీ.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. 10 పరుగుల వద్ద జైస్వాల్(2), 38 పరుగుల వద్ద రాహుల్(14) ఔట్ అయ్యారు. దీంతో సాయి సుదర్శన్‌తో కలిసి గిల్ సంయమనంతో బ్యాటింగ్ చేస్తున్నారు. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. వర్షం కారణంగా రెండో సెషన్ ప్రారంభం ఆలస్యం అవుతోంది.