- Advertisement -
ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన భారత కెప్టెన్‌గా గిల్ నిలిచాడు. ఓవల్‌లో జరుగుతున్న తొలి టెస్టులో గిల్ ఈ రికార్డును అందుకున్నాడు. టీమిండియా సారథిగా ఇప్పటి వరకు సునీల్ గవాస్కర్ పేరిట ఉన్న రికార్డును గిల్ తిరిగరాశాడు. గవాస్కర్ 1978/79లో వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో 732 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు గవాస్కర్ పేరిట ఉన్న రికార్డును గిల్ బద్దలు కొట్టాడు. గిల్ ఇంగ్లండ్ సిరీస్‌లో ఇప్పటికే 743 పరుగులు సాధించాడు. కాగా, విరాట్ కోహ్లి 655 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్‌తో 2016/17లో జరిగిన సిరీస్‌లో కోహ్లి దీన్ని సాధించాడు.
- Advertisement -