మాంచెస్టర్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో టీం ఇండియా కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ (Shubman Gill) శతకం సాధించాడు. ఐదో రోజు 174/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆట ప్రారంభించిన భారత్.. కొంత సమయంలోనే కెఎల్ రాహుల్ వికెట్‌ను కోల్పోయింది. బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో రాహుల్(90) సెంచరీకి చేరువలో ఔట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో గిల్ పట్టువదలకుండా బ్యాటింగ్ చేస్తూ వచ్చాడు. మరోవైపు వాషింగ్టన్ సుందర్ కూడా అతనికి మంచి మద్దతు ఇచ్చాడు. దీంతో 228 బంతుల్లో 12 ఫోర్ల సహాయంతో గిల్ సెంచరీ సాధించాడు.
ఈ సిరీస్‌లో గిల్ (Shubman Gill) మొత్తం నాలుగు సెంచరీలు చేశాడు. ఈ క్రమంలో గిల్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన మొదటి సిరీస్‌లోనే నాలుగు సెంచరీలు చేసిన ఆటగాడిగా గిల్ నిలిచాడు. ఒక టెస్ట్ సిరీస్‌లో భారత్ తరఫున అత్యధిక శతకాలు చేసిన మూడో ఆటగాడిగా కూడా గిల్ రికార్డు సాధించాడు. గతంలో సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లీలు ఒక సిరీస్‌లో నాలుగు సెంచరీలు చేశారు. ఇక టెస్ట్ కెప్టెన్‌గా ఒక సిరీస్‌లో అత్యధిక శతకాలు సాధించిన ఆటగాడిగా కూడా గిల్ రికార్డుల్లోకెక్కాడు. సర్ డాన్ బ్రాడ్‌మాన్, సునీల్ గవాస్కర్ తర్వాత ఈ రికార్డు సాధించిన ఆటగాడిగా గిల్ నిలిచాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. సెంచరీ చేసిన కొంత సమయానికే జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో గిల్ (103) ఔట్ అయ్యాడు. దీంతో లంచ్ బ్రేక్ సమయానికి 89 ఓవర్లలో భారత్ 4 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. క్రీజ్‌లో సుందర్ (21), జడేజా(0) ఉన్నారు. ఈ ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించాలంటే.. భారత్ ఇంకా 88 పరుగులు చేయాలి.