పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు. టాలీవుడ్‌లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో ఒకరైన ఈ పాన్ ఇండియా స్టార్ పెళ్లిపై గతకొంత కాలంగా పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ పెళ్లి ఎవరితో.. ఎప్పుడు జరుగుతుందా అని అభిమానులు ఆసక్తికరంగా చూస్తున్నారు. అయితే తాజాగా ప్రభాస్ పెళ్లిపై మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి తాజాగా ఆయన పెళ్లిపై కొన్ని కామెంట్స్ చేశారు. ఆమె తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే ప్రభాస్ పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ చెబుతామని తెలిపారు. దీంతో మరోసారి ప్రభాస్ పెళ్లిపై అభిమానుల్లో టాక్ మొదలైంది. మరి ఈ పాన్ ఇండియా స్టార్ పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ ఎప్పుడు వస్తుందో చూడాలి.
ఇక ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో ‘స్పిరిట్’ పేరుతో ఓ బహుభాషా చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. త్రిప్తి దిమ్రీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రణయ్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ నెలాఖరున పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. అయితే తొలి షెడ్యూల్ మాత్రం విదేశాల్లో మొదలవుతుందట. మెక్సికో, ఇండోనేషియా, మలేషియా, బ్యాంకాక్ దేశాల్లో కీలక సన్నివేశాలను ప్లాన్ చేసినట్లు తెలిసింది. అయితే ప్రభాస్ మాత్రం నవంబర్ నాటికి సినిమా సెట్లోకి అడుగుపెట్టే అవకాశమున్నట్లు సమాచారం. ఈ బిగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఈ పాన్ ఇండియా స్టార్ కనిపించనున్నారు.