Saturday, August 23, 2025

ఎస్ఐ కండకావరం… వృద్ధ మహిళపై దాడి… వీడియో వైరల్

- Advertisement -
వరంగల్: వృద్ధ మహిళపై ఎస్ఐ చేయిచేసుకున్న సంఘటన వరంగల్ జిల్లా కేంద్రంలో జరిగింది. వరంగల్ ఫోర్ట్ రోడ్డులో అర్ధరాత్రి ఒక రెస్టారెంట్లోకి ఎస్ఐ వచ్చి గ్యాస్ సిలిండర్ తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. రెస్టారెంట్ మూసి చాలా సేపు అయిందని, ఇప్పుడు ఎందుకు సిలిండర్ తీసుకెళ్తున్నారని మహిళ ప్రశ్నించింది.  దీంతో అత్యుత్సాహంతో మహిళపై పోలీస్ అధికారి చేయి చేసుకోవడంతోపాటు దుర్భాషలాడాడు. తన తల్లిని ఎందుకు కొట్టారని కుమారుడు నిలదీయడంతో అతడిపై ఎస్ఐ  దాడి చేశాడు. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో బాధితులు ఫిర్యాదు చేశారు. 
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News