Wednesday, July 16, 2025

పేరెంట్స్‌గా ప్రమోషన్‌ పొందిన కియారా-సిద్ధార్థ్

- Advertisement -
- Advertisement -

ముంబై: బాలీవుడ్‌ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా, నటి కియారా అడ్వాణీలకు (Sidarth and Kiara) తల్లిదండ్రులుగా ప్రమోషన్ వచ్చింది. కియారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఈ జంట సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ముంబై రిలియన్స్ ఆస్పత్రిలో కియారా ప్రసవించింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. ఈ సందర్భంగా సెలబ్రిటీలు, అభిమానులు వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు 2025 ఫిబ్రవరిలో ఈ జంట ప్రకటించారు. 2021లో విడుదలైన ‘షేర్షా’ అనే చిత్రంలో సిద్ధార్థ్, కియారా కలిసి నటించారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయమే ప్రేమకు, ఆ తర్వాత పెళ్లికి దారి తీసింది.

‘కాఫీ విత్ కరణ్’ సీజన్ 8లో కియారా తన ప్రేమ (Sidarth and Kiara) కథను పంచుకుంది. ఇటలీలో సిద్ధార్థ్ తనకు ప్రపోజ్ చేశాడని తెలిపింది. దీంతో 2023, ఫిబ్రవరి 7న వీరి వివాహం జరిగింది. ఇక సినిమాల విషయానికొస్తే.. కియారా త్వరలో ఎన్టిఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న ‘వార్-2’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. సిద్ధార్థ్, జాన్వీ కపూర్‌తో కలిసి ‘పరమ్ సుందరి’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు అరునాబ్ కుమార్ దర్శకత్వంలో ‘వివాన్: ది ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’లో సిద్ధార్థ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News