హైదరాబాద్: క్రమశిక్షణ కమిటీతో సిద్ధిపేట డిసిసి అధ్యక్షుడు నర్సారెడ్డి (Siddipet DCC President Narsa Reddy) భేటీ ముగిసింది. గతంలో నర్సారెడ్డికి క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని కమిటీ ఆయనకు ఆదేశాలు జారీ చేసింది. తాను ఎవరినీ కించపర్చలేదని, దళితుల సహకారంతోనే ఎదిగానని చెప్పారు. దళితులకే పదవులు ఎక్కువ ఇచ్చానని, కావాలనే తనపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
Also Read: మూలాలు మరచి.. విన్యాసాలెందుకు?
మునుగోడు కాంగ్రెస్ ఎంఎల్ఎ రాజగోపాల్ రెడ్డిపై తమకు ఫిర్యాదు రాలేదని కమిటీ సభ్యుడు, ఎంపి మల్లు రవి తెలిపారు. లేదంటే పిసిసి అయినా చెప్పాలని, తమకు ఫిర్యాదు రాలేదు కాబట్టే చర్చించలేదన్నారు. స్థానిక ఎన్నికలు రాబోతున్నాయని, అందరూ సంయమనం పాటించాలని మల్లు రవి సూచనలు చేశారు. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సారెడ్డి (Siddipet DCC President Narsa Reddy) తన పార్టీ ఎస్‌సి సెల్ నాయకుడిపై చేయి చేసుకున్నాడు. దీంతో నర్సారెడ్డిపై త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌సి, ఎస్‌టి ఎట్రాసిటీ కేసు నమోదైన విషయం తెలిసిందే. దీంతో ఆయన క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు.