బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్స్‌లో అరుదైన ఘనత నమోదైంది. ప్రముఖ ఆర్ధోపెడిక్ సర్జన్ డాక్టర్ సంజీబ్ కుమార్ బెహెరా ఒకే రోజు, ఒకే వేదికపై 17 కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి సాయం త్రం 4 గంటల వరకు మొత్తం 8 గంటల వ్యవధిలో ఈ శస్త్ర చికిత్సలు పూర్తయ్యాయి. ఇవన్నీ ఒక్క డాక్టరే చేపట్టడం ప్రత్యేకంగా నిలిచింది. దేశ వ్యాప్తంగా ఉన్న ఆర్ధోపెడిక్ కేంద్రాల్లో కూడా ఇటువంటి అధిక పరిణామం శస్త్ర చికిత్సలు ఒకే సర్జన్ చేయడం చాలా అరుదుగా చూస్తాం. ఈ విజయంతో కేర్ బంజారా హాస్పిటల్స్, క్లీనికల్ నాణ్యత, ప్రతిభ, సామర్థాలను మళ్లీ నిరూపించుకుంది. దేశంలోనే అగ్రశ్రేణి మస్కులోస్కెలెటర్ కేర్ అందించే ఆసుపత్రుల సరసన నిలిచింది. ఈ సందర్భంగా బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్స్ ఆర్థోపెడిక్, జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జరీ విభాగం క్లీనికల్ డైరెక్టర్, హెచ్‌ఒడి డాక్టర్ సంజీబ్ కుమార్ బెహరా మాట్లాడుతూ ‘ఇది సంఖ్యల కోసం పోటీ కాదు.
కేర్ బంజారాలో ఉన్న బల మైన వ్యవస్థ, అనుభవజ్ఞులైన వైద్యబృందం మద్దతుతో, అధిక వాల్యూమ్‌ని సైతం నాణ్యతతో నిర్వహించగలమన్నది మా లక్షం. ఈ విజయం అన్ని విభాగాల సహకారంతో సాధ్యమైంద’ని చెప్పారు. ఈ ఘనతతో కేర్ బంజారా హాస్పిటల్స్ శస్త్ర చికిత్సకు ముందు, తరువాత పద్ధతుల్లోనూ, క్లీనికల్ ప్రోటోకాల్స్‌లోనూ మెరుగైన ప్రమాణాలను పాటిస్తున్నదన్న విషయం మరోసారి స్పష్టమైంది. ఈ సందర్భంగా కేర్ హాస్పిటల్స్ జోనల్ సిఒఒ బిజు నాయర్ మాట్లాడుతూ ‘ఇది కేవలం వైద్యకృతికౌశల్యం మాత్రమే కాదు, కేర్ బంజారాలో జరుగుతున్న లోతైన మార్పుల సూచిక కూడా. మా వైద్య బృందాలు సమిష్టిగా పనిచేస్తూ , వేగవంతమైన సేవ, నాణ్యమైన ఫలితాల కోసం కృషి చేస్తున్నాయి. కేర్ బంజారాను ఒక నమ్మదగిన శస్త్ర చికిత్స కేంద్రంగా మారుస్తున్నా’మని తెలిపారు.