క్రికెట్‌లో ఏ ఆటగాడు ఎప్పుడు చరిత్రను సృస్టిస్తాడో మనం అస్సలు ఊహించలేము. ఒకోసారి స్టార్ ఆటగాళ్ల రికార్డులను.. చిన్న జట్టులోని ఆటగాళ్లు తిరగరాస్తారు. ఇలాంటి ఘటనే శ్రీలంక, జింబాబ్వే మధ్య జరిగిన టి-20 మ్యాచ్‌లో చోటు చేసుకుంది. జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా (Sikandar Raza) అంతర్జాతీయ టి-20ల్లో చరిత్ర సృష్టించాడు. ఐసిసి ఫుల్ మెంబర్స్ దేశాల్లో అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో టిం ఇండియి స్టార్లు విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్‌లను వెనక్కి నెట్టాడు.
శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో మొత్తం రజా (Sikandar Raza) తన టి-20 కెరీర్‌లో 17 సార్లు ఈ అవార్డును అందుకున్నాడు. కోహ్లీ, స్కైలు 16 సార్లు ఈ అవార్డును సొంతం చేసుకున్నరు. ఓవరాల్‌గా ఐసిసి సభ్య దేశాలన్నీకలిపి టి-20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న రికార్డు మలేసియా ఆటగాడు విరన్‌దీప్ సింగ్ పేరిట ఉంది. ఇతను 22 సార్లు ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు.
Also Read : ఇండియా ఎ కెప్టెన్‌గా శ్రేయస్