ముంబై : బంగారం మాదిరుగానే వెండి ధర కూడా పరుగులు పెడుతోంది. సోమవారం కిలో వెండి ధర రూ.1000 పెరిగి రూ.1,21,000 కు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.1,01,660 గా ఉంది. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబిజెఎ) ప్రకారం, ఆగస్టు 25న వెండి ధరలు కొత్త రికార్డు స్థాయికి చేరుకుంది. ఒక కిలో వెండి రూ.2,227 పెరిగి రూ.1,16,133కు చేరింది. గత శుక్రవారం వెండి ధర రూ.1,13,906గా ఉంది. బంగారం ధర కూడా పెరిగింది. కేడియా కమోడిటీ అంచనాల ప్రకారం, 2025 చివరినాటికి వెండి ధర కిలోకు రూ.1.30 లక్షలు తాకవచ్చు. మనీకంట్రోల్ అంచనా ప్రకారం, వెండి 34% పెరిగి రూ.1.46 లక్షల వరకు వెళ్లే అవకాశం ఉంది. సిటీగ్రూప్ నివేదిక మాత్రం ధర రూ.1.20 లక్షల నుంచి రూ.1.30 లక్షల మధ్యలో ఉండవచ్చని సూచిస్తోంది. అదే సమయంలో బంగారం ధర ఈ సంవత్సరం రూ.1.04 లక్షల వరకు పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు.
వెండి ఆల్‌టైమ్ రికార్డు
- Advertisement -
- Advertisement -
- Advertisement -